చార్‌ధామ్ యాత్ర గురించి

Why is Chardham yatra considered as most auspicious in Hinduism?

హిందువులు చార్‌ధామ్ యాత్రను అత్యంత పవిత్రమైనదిగా ఎందుకు భావిస్తారు?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఎత్తైన గర్హ్వాల్ అనే ప్రాంతంలో నెలకొని ఉన్న నాలుగు పుణ్య నదులు యమున (యమునోత్రి), గంగా (గంగోత్రి), మందాకిని (కేదారనాధ్), మరియు అలకనంద (బదరీనాధ్) ఆధారంగా చార్‌ధామ్ పవిత్ర స్థలాలను గుర్తించారు. హిందువులుగా ఉన్న ప్రతిఒక్కరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ పవిత్ర చార్‌ధామ్ యాత్ర చేయాలని భావిస్తారు. అక్కడికి వెళితే పాపాలు అన్నీ తొలగిపోవడమే కాకుండా జనన మరణాల కాలచక్రం నుండి విముక్తులు అవుతారని భక్తుల విశ్వాసం.     

What is the right order to cover Char Dham?

చార్‌ధామ్ యాత్ర చేయడానికి సరైన క్రమం ఏది?

చార్‌ధామ్ యాత్రను చేయడానికి సవ్యదశలో, భౌగోళికంగా ఎడమ నుంచి కుడివైపునకు అంటే యమునోత్రితో మొదలుపెట్టి గంగోత్రి, కేదారనాథ్, బదరీనాధ్ వెళ్ళాలి. ఈ వరుస క్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

చార్‌ధామ్ దేవాలయాలు తెరుచుకునే మరియు మూసివేసే తేదీలు & పూర్తి సమాచారం

When does the Chardham Yatra begin and end?

చార్‌ధామ్ యాత్ర ఎప్పుడు మొదలయి ముగుస్తుంది?

చార్‌ధామ్ యాత్ర సవ్యదిశలో యమునోత్రి దగ్గర మొదలయ్యి, గంగోత్రి, కేదారనాధ్ మీదుగా వెళ్లి బదరీనాధ్ వద్ద ముగుస్తుంది. 

Yamunotri Temple

యమునోత్రి క్షేత్రం  

యమునోత్రి క్షేత్రం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 26వ తేదీన యాత్రికులు/ సందర్శకుల కోసం తెరుచుకుని భాయ్ దూజ్ పండుగ రోజున మూసివేయబడుతుంది.

Gangotri Temple

గంగోత్రి క్షేత్రం

గంగోత్రి క్షేత్రం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 26వ తేదీన యాత్రికులు/ సందర్శకుల కోసం తెరుచుకుని దీపావళి పండుగ రోజున మూసివేయబడుతుంది.

Kedarnath Temple

కేదారనాధ్ క్షేత్రం 

కేదారనాధ్ దేవాలయ తలుపులు అక్షయ తృతీయ తరువాత కొద్దీ రోజులకి తెరుచుకుని భాయ్ దూజ్ పండుగ రోజుకి మూసివేయబడతాయి. 

Badrinath Temple

బదరీనాధ్ క్షేత్రం 

యాత్రికుల కోసం ప్రతి సంవత్సరం బదరీనాధ్  తలుపులు అక్షయ తృతీయ తరువాత తెరుచుకుని విజయదశమి అంటే దసరా రోజున మూసివేయబడతాయి. 

What is the Chardham Yatra Opening and Closing dates of 2020?

2020 సంవత్సరానికి చార్‌ధామ్ యాత్ర మొదలయ్యే మరియు మూసివేసే తేదీలు ఏమిటి?

చార్‌ధామ్ క్షేత్రం తెరుచుకునే తేదీ మూసివేసే తేదీ
యమునోత్రి 26 ఏప్రిల్ 2020 16 నవంబర్ 2020
గంగోత్రి 26 ఏప్రిల్ 2020 15 నవంబర్ 2020
కేదారనాధ్ 29 ఏప్రిల్ 2020 16 నవంబర్ 2020
బదరీనాధ్ 30 ఏప్రిల్ 2020 25 అక్టోబర్ 2020

What is darshan timing at each dham?

ఒక్కో క్షేత్రంలో దర్శన వేళలు ఏమిటి?

చార్‌ధామ్ క్షేత్రాల దర్శన సమయాలు ఈ విధంగా ఉన్నాయి- 

యమునోత్రి-

యాత్రికుల సందర్శనకై  యమునోత్రి క్షేత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. 

యమునోత్రిలో హారతి ఇచ్చే సమయం : ఉదయం 6:30 మరియు రాత్రి 7:30   

గంగోత్రి-

గంగోత్రి క్షేత్రం ఉదయం 6:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9:30 వరకు యాత్రికుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. 

కేదారనాధ్- 

కేదారనాధ్ దేవాలయంలో పూజ ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు జరిగే పూజలో మీరు పాల్గొనవచ్చు. తదుపరి సాధారణ దర్శనార్థం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచి 3 గంటల పాటు మూసివేస్తారు. మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. 

బదరీనాధ్ –

బదరీనాధ్  ఆలయంలో ఉదయం పూజ 4:30 గంటల నుండి 6:30 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం 7:00 నుండి 8:00 గంటల మధ్యలో భక్తుల దర్శనార్థం ఆలయంలోకి ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. తరువాత 3 గంటల పాటు ఆలయం మూసివేసి మరలా సాయంత్రం 4 గంటలకు తెరిచి రాత్రి 9 కి దర్శనాలు పూర్తి అయ్యాక ఆలయాన్ని మూసివేస్తారు. 

What is the Safest and the Best Time to Go on Char Dham Yatra?

చార్‌ధామ్ యాత్ర చేయడానికి అనువైన, సురక్షితమైన సమయం ఏది?

ఏడాదికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉండే తీర్థయాత్ర ఈ చార్‌ధామ్. శీతాకాలంలో మంచు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని పూర్తిగా మూసివేసి వేసవి కాలంలో తెరుస్తారు. 

అందువల్ల చార్‌ధామ్ యాత్రకి అత్యంత అనువైన కాలం ఏప్రిల్, మే మాసాలు మరియు జూన్ నెల  మధ్య వరకు. 

మీరు ఒకవేళ వేసవి కాలంలో వెళ్లలేకపోతే శీతాకాలం మొదలవుతుండగా అంటే సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యలో వెళ్ళచ్చు. జూన్ ద్వితీయార్థం నుండి జులై నెల ముగిసే వరకు వర్షాకాలంలో ఈ యాత్ర చేయడం మంచిది కాదు. వర్షాకాలంలో విపరీతమైన వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అది అనువైన సమయం కాదు. 

కాబట్టి ముందుగా మీ ట్రావెల్స్ వాళ్ళతో అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుకుని టిక్కెట్లు బుక్ చేసుకుంటే మంచిది. 

చార్‌ధామ్ యాత్ర నమోదు ప్రక్రియ (రిజిస్ట్రేషన్)

Is registration required for Chardham Yatra?

చార్‌ధామ్ యాత్ర కొరకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలా?

అవును, ఎంత మంది యాత్రికులు వెళ్తున్నారు అని తెలియడం కోసం నమోదు ప్రక్రియను తప్పనిసరి చేశారు. దీనివల్ల ప్రమాదాలు ఏవైనా సంభవిస్తే రక్షణ/ భద్రతా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ నమోదు ప్రక్రియ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ అనే రెండు పద్ధతులలో ఉంటుంది. 

 

Offline Registration

ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్- ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కొరకు మొత్తం 14 సెంటర్లు ఏర్పాటు చేసియున్నారు. వాటి ద్వారా మీ సొంతగా లేదా ట్రావెల్స్ వాళ్ళ ద్వారా అయినా సులభంగా నమోదు చేసుకోవచ్చు.  

రిజిస్ట్రేషన్ కొరకు ఉన్న 14 సెంటర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి- 

చార్‌ధామ్ యాత్రా స్థలం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉన్న ప్రదేశం
హరిద్వార్ రైల్వేస్టేషన్
హరిద్వార్ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పార్కింగ్
రిషికేష్ రోడ్‌వేస్ బస్ స్టాండ్
రిషికేష్ హేమకుంద్ గురుద్వారా
జానకి ఛట్టి జానకి ఛట్టి
గంగోత్రి గంగోత్రి
గుప్తాక్షి గుప్తాక్షి
ఫాటా ఫాటా
సోన్‌ప్రయాగ్ సోన్‌ప్రయాగ్
కేదారనాధ్ కేదారనాధ్
పండుకేశ్వర్ పండుకేశ్వర్
గోవింద్ ఘాట్ గోవింద్ ఘాట్
ఉత్తరకాశి హినా
ఉత్తరకాశి దొబాటా

పై సెంటర్లు అన్నింటిలో కూడా సరైన బయోమెట్రిక్ విధానంతో కూడిన నమోదు ప్రక్రియకు వీలు కల్పిస్తున్నారు. 

మీరు చేయాల్సిందల్లా, మీరు ఏ చార్‌ధామ్ యాత్రకు వెళ్ళాలి అనుకుంటున్నారు, అలాగే ఏరకమైన యాత్ర చేయాలనుకుంటున్నారు (చార్‌ధామ్, దో ధామ్ లేదా ఏక్ ధామ్) అనేది రిజిస్ట్రేషన్ సెంటర్ వద్ద తెలియజేయాలి. 

Online Registration-

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్- 

మీ పేరు, వివరాలతో నమోదు చేసుకోడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం చాలా సులభం, దీనివల్ల పెద్ద క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం ఉండదు. 

  1. మొదటిగా గార్వాల్ మడల్ వికాస్ నిగమ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్ళి, అందులో ఫారం నింపాలి.  
  2. తద్వారా మీ ఈమెయిల్‌కు వెరిఫికేషన్ లింక్ పంపిస్తారు, మీరు దాన్ని యాక్టీవేట్ చేసుకుని సులువుగా లాగ్‌ఇన్ అవచ్చు. 
  3. “Book to Darshans” అనే లింక్‌పై క్లిక్ చేయాలి
  4. బుకింగ్ కొరకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది, దానిలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, యాత్రికుని వివరాలు ఎంచుకోవాలి. 
  5. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్‌ని ధృవీకరించి డబ్బులు కట్టాలి.

చార్‌ధామ్ యాత్ర వ్యవధి

How much time is required for Chardham yatra?

చార్‌ధామ్ యాత్రకు ఎన్ని రోజుల సమయం పడుతుంది?

సాధారణంగా రోడ్డు ప్రయాణ ద్వారా 10-11 రోజులు, హెలికాప్టర్‌లో 4-5 రోజుల సమయం పడుతుంది. అలాగే మీరు ఒక రోజు హెలికాప్టర్ యాత్ర ద్వారా ఒకటి లేదా రెండు క్షేత్రాల సందర్శనకు కూడా అవకాశం ఉంది.  

What is the regular Chardham Yatra Duration by Road/Surface

సాధారణంగా రోడ్డు మార్గంలో చార్‌ధామ్ యాత్ర చేయడానికి ఎంత వ్యవధి అవసరం 

  • న్యూ ఢిల్లీ నుంచి- అన్ని చార్‌ధామ్ క్షేత్రాలు తిరిగి న్యూ ఢిల్లీ రావడానికి పూర్తిగా పదకొండు రాత్రులు & పన్నెండు పగళ్లు.  
  • డెహ్రాడూన్/ హరిద్వార్/ రిషికేష్ నుంచి- అన్ని చార్‌ధామ్ క్షేత్రాలు తిరిగి న్యూ ఢిల్లీ రావడానికి పూర్తిగా తొమ్మిది రాత్రులు & పది పగళ్లు.  

What is the regular Do Dham Yatra (Kedarnath & Badrinath) Duration by Road/Surface?

సాధారణంగా రోడ్డు మార్గంలో రెండు క్షేత్రాల యాత్ర (కేదారనాధ్ & బదరీనాధ్) వ్యవధి ఎంత?

  • హరిద్వార్ నుండి హరిద్వార్‌కు: ఐదు రాత్రులు & ఆరు పగళ్లు
  • న్యూ ఢిల్లీ నుండి న్యూ ఢిల్లీకి: ఆరు రాత్రులు & ఏడు పగళ్లు 

What is the regular Do Dham Yatra (Yamunotri & Gangotri) Duration by Road/Surface?

సాధారణంగా రోడ్డు/ హెలికాప్టర్ మార్గాల్లో (దో ధామ్) రెండు క్షేత్రాల యాత్ర (యమునోత్రి & గంగోత్రి) వ్యవధి ఎంత? 

  • హరిద్వార్ నుండి హరిద్వార్‌కు : ఐదు రాత్రులు & ఆరు పగళ్లు 
  • న్యూ ఢిల్లీ నుండి న్యూ ఢిల్లీకి : ఆరు రాత్రులు & ఏడు పగళ్లు

What is the regular Chardham Yatra Duration by Helicopter?

సాధారణంగా హెలికాప్టర్ ద్వారా చార్‌ధామ్‌ యాత్ర వ్యవధి ఎంత? 

  • డెహ్రాడూన్ నుండి- హెలికాఫ్టర్ ద్వారా సహస్రధార డెహ్రాడూన్ హెలిప్యాడ్ నుండి నాలుగు రాత్రులు, ఐదు పగళ్ళు

What is the regular Do Dham Yatra (Kedarnath & Badrinath) Yatra Duration by Helicopter?

సాధారణంగా హెలికాప్టర్ ద్వారా రెండు క్షేత్రాల యాత్ర (కేదారనాధ్ & బదరీనాధ్) వ్యవధి ఎంత? 

  • డెహ్రాడూన్ నుండి- హెలికాఫ్టర్ ద్వారా కేదార్-బదరీ యాత్ర అదే రోజు పూర్తిచేసేయచ్చు.   

What is the regular Chardham Yatra Duration if  I club surface with helicopter?

కొంత రోడ్డు మరియు హెలికాప్టర్ ద్వారా చార్‌ధామ్ యాత్ర చేయడానికి వ్యవధి ఎంత?

  • డెహ్రాడూన్ నుండి డెహ్రాడూన్‌కు: ఏడూ రాత్రులు & ఎనిమిది పగళ్లు 
  • న్యూ ఢిల్లీ నుండి న్యూ ఢిల్లీకి: తొమ్మిది రాత్రులు & పది పగళ్లు

How long is Yamunotri Trek and how would it be covered?

యమునోత్రి ట్రెక్ ఎంత దూరం, ఎలా వెళ్ళవచ్చు? 

జానకి ఛట్టి నుండి యమునోత్రికి 6 కిమీ దూరం ఉంది. అది మీరు పూర్తిగా నడిచి వెళ్ళచ్చు లేదా పల్లకీ/ దండి/ కండి & గుఱ్ఱాలు/పోనీలు వంటి వాటిపై చేరుకోవచ్చు. వీటిని జానకి ఛట్టి నుండి బుకింగ్ చేసుకోవచ్చు, వాటి ధర వివరాలు ఇలా ఉన్నాయి. జానకి ఛట్టి నుండి యమునోత్రికి-

దండి ధర ఒకరికి రూ. 1900

కండి ధర ఒకరికి రూ. 840

పోనీ ధర ఒకరికి రూ. 640

How long is Kedarnath Trek and how would it be covered?

కేదారనాధ్ ట్రెక్ ఎంత దూరం మరియు అక్కడికి ఎలా వెళ్ళవచ్చు?

కేదారనాధ్ ట్రెక్ దూరం మొత్తం 16 కిమీ, గౌరీకుండ్ నుంచి మొదలయ్యే దారి కేదారనాధ్ చేరుస్తుంది. సొన్‌ప్రయాగ్ నుండి సుమారు 6 కిమీ దూరం గౌరీకుండ్ వరకు టాక్సీలో వెళ్ళి అక్కడి నుండి నడిచి వెళ్ళవలసి ఉంటుంది. 

గౌరీకుండ్ నుండి కేదారనాధ్ వెళ్ళడానికి సుమారు 16 కిమీ ఉండే నడక దారి 

గౌరీకుండ్– 6 కిమీ → రామ్‌బారా బ్రిడ్జి – 4 కిమీ → జంగిల్ ఛట్టి – 3 కిమీ → భీంబాలి – 4 కిమీ → లించౌలి – 4 కిమీ → కేదారనాధ్ బేస్ క్యాంప్ – 1 కిమీ → కేదారనాధ్ క్షేత్రం

చార్‌ధామ్ పరిసర ప్రాంతాల్లో యాత్ర & వసతి వివరాలు

Where is the nearest International  airport located for Chardham yatra?

చార్‌ధామ్ యాత్ర చేయడానికి దగ్గరలో అనువుగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏది?

చార్‌ధామ్ యాత్ర చేయడానికి సమీప విమానాశ్రయం న్యూ ఢిల్లీలో ఉంది, అది ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజిఐ). 

Where is the nearest domestic airport located for Chardham yatra?

చార్‌ధామ్ యాత్ర చేయడానికి దగ్గరలో అనువుగా ఉన్న ప్రాంతీయ విమానాశ్రయం ఏది?

చార్‌ధామ్ యాత్రకు దగ్గరలో డెహ్రాడూన్ విమానాశ్రయం ఉంది, అది జాలీ గ్రాంట్ విమానాశ్రయం. మీరు అక్కడి నుండే నేరుగా చార్‌ధామ్ యాత్ర మొదలుపెట్టచ్చు. 

Where is the nearest railway station for Chardham yatra?

చార్‌ధామ్ యాత్ర చేయడానికి దగ్గరలో అనువుగా ఉన్న రైల్వే స్టేషన్ ఏది?

చార్‌ధామ్ యాత్ర మొదలుపెట్టడానికి దగ్గరలో ఉన్నది హరిద్వార్ జంక్షన్ రైల్వే స్టేషన్. 

Where is the nearest Inter State Bus terminal for Chardham yatra?

చార్‌ధామ్ యాత్ర చేయడానికి దగ్గరలో అనువుగా ఉన్న బస్సు స్టేషన్ ఏది?

చార్‌ధామ్ యాత్ర మొదలుపెట్టడానికి దగ్గరలో ఉన్న బస్సు స్టేషన్లు హరిద్వార్/ డెహ్రాడూన్/ రిషికేష్‌లలో ఉన్నాయి. (అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్)

Can I take a bus from New Delhi for Chardham yatra?

చార్‌ధామ్ యాత్ర చేయడానికి నేను నేరుగా న్యూ ఢిల్లీ నుండి బస్సులో చేరుకునే అవకాశం ఉందా?

న్యూ ఢిల్లీ నుండి చార్‌ధామ్ యాత్ర కోసం ప్రత్యేకమైన బస్సు సర్వీసులు అందుబాటులో లేవు. మీరు న్యూ ఢిల్లీ అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ నుండి హరిద్వార్, రిషికేష్ లేదా డెహ్రాడూన్ వెళ్ళే  ఉత్తరాఖండ్ బస్సు సర్వీసులు ఉపయోగించుకోవచ్చు. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తిరగడానికి బస్సు సర్వీసులను నమ్ముకోవడం మంచిది కాదు. ప్రైవేటు ట్యాక్సీ లేదా ట్రావెల్స్ బుక్ చేసుకోవడం మంచిది. 

Can I do my Chardham / Do Dham/ Ek dham yatra on my own?

చార్‌ధామ్/ రెండు క్షేత్ర యాత్ర లేదా ఒక క్షేత్ర యాత్ర చేయడానికి నా అంతట నేను వెళ్ళడం సాధ్యమేనా? 

ఛార్‌ధామ్ యాత్ర అంత సులువైనది కాదు, చాలా క్లిష్టమైనది. అయితే మీరు సాహసోపేతమైన ప్రయాణాలను ఇష్టపడేవారు అయితే మీరు ఒక్కరే లేదా స్నేహితులతో కలిసి వెళ్ళచ్చు. కానీ మీ సొంతంగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ళతో కలిసి వెళ్ళడం మంచిది కాదు. చాలావరకు హోటళ్లు, వసతి గృహాలు ట్రావెల్స్ వాళ్ళు ముందుగా బుక్ చేసుకుంటారు, అందువల్ల ఒక మంచి ట్రావెల్స్ వాళ్ళని చూసుకుని బుక్ చేసుకోవడమే ఉత్తమం. కేవలం రెండు క్షేత్రాలకు మాత్రమే వాహనాలు వెళ్లగలవు (బదరీనాధ్, గంగోత్రి). మిగిలిన రెండు (యమునోత్రి, కేదార్నాధ్) చేరుకోడానికి నడకదారి మాత్రమే ఉంది, కాబట్టి సరైన ప్రణాళిక అవసరం. అలాగే, చార్‌ధామ్ సీజన్‌లో అయితే హోటళ్ళు దొరకడం చాలా కష్టం. అదే ట్రావెల్స్ వారి ద్వారా బుక్ చేసుకుంటే మీరు అనుకున్న బడ్జెట్‌లో ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మంచి ట్రావెల్స్ ద్వారా ట్యాక్సీ లేదా హెలికాప్టర్‌లో కూడా చార్‌ధామ్ యాత్రను పూర్తి చేయచ్చు. 

How is the road condition of the Chardham Sector of Uttarakhand?

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ పరిసర ప్రాంత రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 

కేదారనాధ్‌లో 2013వ సంవత్సరంలో జరిగిన ప్రకృతి విపత్తు తరువాత ప్రభుత్వం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా రోడ్డు ప్రకటించి వేశారు. 2013 మృతులకు అంకితమిస్తూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన తరువాత ఇప్పుడు రోడ్లు వెడల్పు అయ్యి ముందు కన్నా ఎంతో మెరుగయింది.

ఈ చార్‌ధామ్ ఆల్ వెదర్ హైవే ప్రయోజెక్టు అన్ని వాతావరణాలను తట్టుకునే రహదారి నిర్మాణం వ్యయం సుమారు 12,000 కోట్ల, దీనివల్ల ఉత్తరాఖండ్ చార్‌ధామ్‌లోని నాలుగు ప్రధాన క్షేత్రాలకు మంచి రహదారి సదుపాయం ఏర్పడుతోంది. 

చార్‌ధామ్ మహామార్గ్‌గా పిలిచే ఈ 900 కిమీ రహదారిని పూర్తిగా ఆధునీకరించి రెండు వరుసల్లో వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27వ తేదీన ప్రకటించారు. ఈ చార్‌ధామ్ రహదారి ప్రాజెక్టులో మొత్తం 12 బైపాస్ రోడ్డులు, 15 పెద్ద ఫ్లైఓవర్లు, 3,596 కల్వర్టులు, రెండు సొరంగాలు, 101 చిన్న సొరంగాలు ఉన్నాయి. ఈ రహదారులను హిమాలయ కొండ చరియల్లో ఉండే అన్ని రకాల వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. 

Can I drive my own car for Chardham Yatra?

చార్‌ధామ్ యాత్రకు నా సొంత కారులో వెళ్ళడం సురక్షితమేనా?

చార్‌ధామ్ యాత్ర సీజన్లో సొంతంగా డ్రైవింగ్ చెయ్యడం అస్సలు మంచిది కాదు. నిటారుగా ఉండే ఆ రోడ్లపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టతరం. హిమాలయ కొండ చరియల్లో అకస్మాత్తుగా వచ్చే మలుపులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. సాధారణంగా ఇవి అలవాటు లేకుండా డ్రైవింగ్ చేయడం ప్రమాదమే అవుతుంది. అందువల్ల చార్‌ధామ్ ట్రావెల్స్ వాళ్ళని సంప్రదించడమే ఉత్తమం. 

What are the types of accommodations available on the Chardham route?

చార్‌ధామ్ యాత్ర దారిలో ఎటువంటి వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి?

ధర్మసత్రాలు, లాడ్జిలు, ఆశ్రమాలు, గెస్ట్ హౌసులు, టెంట్లు, క్యాంపులు, హోటళ్ళు, రిసార్టులు మొదలైనవి చార్‌ధామ్ యాత్ర సమయంలో అందుబాటులో ఉంటాయి. వీటిలో మీ బడ్జెట్‌కు తగ్గట్టు వసతి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వృద్ధులను తీసుకువెళుతుంటే హోటళ్ళు బుక్ చేసుకోవడం మంచిది. 

ఈ యాత్రకు ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకోవడం వల్ల ఒకేసారి వసతి, భోజనం. ట్యాక్సీ, హెలికాఫ్టర్, కేదారనాధ్‌లో హెలికాఫ్టర్ మొదలైన అన్నిరకాల సర్వీసులు ఒకేసారి బుకింగ్ చేసుకోవచ్చు.  

What Kind of meals are provided in the Chardham sector?

చార్‌ధామ్ పరిసరాల్లో ఎటువంటి భోజన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి?

హోటళ్ళు, రెస్టారెంట్లలో శాకాహార భోజనం దొరుకుతుంది. మీరు ముందుగా ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకుంటే వసతితో పాటు భోజనం కూడా తక్కువ ఖర్చులో అయిపోతుంది.

ఆరోగ్యం & భద్రత

Is there any physical fitness parameter for Chardham yatra?

చార్‌ధామ్ యాత్ర చేయడానికి శారీరక ఫిట్‌నెస్ కొలమానాలు ఏమైనా ఉన్నాయా?

మీరు సాధారణంగా ఆరోగ్యకరంతో ఉన్నప్పుడు ఫిట్‌నెస్ కొలమానాలు అంటూ నిబంధనలు ఏమీ లేవు, వయసు 50 సంవత్సరాల లోపు అయితే మంచిది. ఈ యాత్రలో నడిచి వెళ్ళే దారులు, అది కూడా ఎక్కువ దూరాలు ఉండటం వల్ల  వయసు సాధారణ ఆరోగ్యం ఉంటె సరిపోతుంది. అందులోనూ యమునోత్రి 6 కిమీ, జానకి ఛట్టి నుండి కేదారనాధ్‌కు 18 కిమీ నడవాలి. గుఱ్ఱం, పోని, హెలికాఫ్టర్ వంటి సదుపాయాలు కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ వాటి వల్ల శారీరకంగానూ, మానసికంగా కూడా ఒత్తిడి ఉంటుంది. 

చార్‌ధామ్ యాత్రలో భాగంగా రోజుకు 6-8 గంటలు 6 నుండి 8 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. కొండలు కోనల్లో అకస్మాత్తుగా వచ్చే ఎత్తు పల్లాలు, మలుపులు వంటి వాటి వల్ల అలవాటు లేని కారణంగా  ఒక్కసారిగా నీరసించిపోయే అవకాశం ఉంది కాబట్టి యాత్రకు కొద్దీ రోజుల ముందు నుంచే వాకింగ్, జాగింగ్, మెట్లు ఎక్కి దిగడం, వేగంగా నడవటం వంటి వ్యాయామాలు, షటిల్ వంటి ఆటలు ఆడటం చేస్తే యాత్రలో నిరసించిపోకుండా ఆనందంగా పూర్తి చేసి అందమైన జ్ఞాపకాలతో తిరిగి వెళ్ళచ్చు.    

Will I be provided with Medical Facilities during the Yatra?

యాత్రా సమయంలో వైద్య సదుపాయాలు ఎంత మేరకు అందుబాటులో ఉంటాయి?

ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ చార్‌ధామ్ పరిసర ప్రాంతాల్లో అన్నిచోట్లా వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచింది. యాత్రికుల ప్రయాణం సుఖంగా సాగడం కోసం ప్రభుత్వం దారి పొడుగునా వైద్యశాలలు ఏర్పాటు చేసింది. అత్యవసర సమయాల్లో దగ్గరలో ఉన్న ఏదైనా వైద్యశాలకు వెళ్ళచ్చు. 

Is a medical certificate required for Chardham yatra?

చార్‌ధామ్ యాత్రకు మెడికల్ సర్టిఫికేట్ అవసరమా?

మీ వయసు 50 సంవత్సరాలు పైబడి ఉంటే మీకు మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. సదరు సర్టిఫికెటును యాత్ర సమయంలో అధికారులు ఎప్పుడు అడిగినా చూపించవలసి ఉంటుంది. అత్యవసర సమయాల్లో యాత్రికుల సంఖ్యను తెలుసుకోవడానికై మీరు తప్పనిసరిగా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

యాత్రకు బయలుదేరడానికి ముందే మీరు డాక్టర్‌ను కలిసి పూర్తిగా ఆరోగ్యం చెకప్ చేయించుకోవాలి. ఈ యాత్రలో ఎత్తైన ప్రాంతాలకు వెళ్లడం, చాలా రోజులు ప్రయాణం ఉంటుంది కాబట్టి మీరు మానసికంగా, శారీరకంగా కూడా సిద్ధంగా ఉండాలి. అధిక రక్తపోటు ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు ఈ యాత్రకు వెళ్ళడానికి ముందు తప్పనిసరిగా డాక్టర్ చెకప్ చేయించుకోవాలి. 

Can I get medical certificate registration while I am on the journey?

ప్రయాణంలో ఉండగా నేను మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవచ్చా?

యాత్రకు బయలుదేరడానికి ముందరే మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని ఉండాలి. సదరు పత్రాలు అన్ని బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమవుతాయి. 

In case of  any medical emergency what are your measures?

అత్యవసర వైద్య సహాయం అవసరమొస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

చార్‌ధామ్ అధికారులు మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వ పర్యాటక శాఖ యాత్రికులందరికీ  సరైన వైద్య సదుపాయాలు, భద్రత అందే ఏర్పాటు చేశాయి. చార్‌ధామ్ ప్రాంతం మొత్తంలో 49 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. అత్యవసర వైద్య పరిస్థితులలో సమన్వయంతో 108 అంబులెన్సు సర్వీసులు సిద్ధంగా ఉంటాయి. 108 అంబులెన్సు సర్వీసులు కేంద్ర ఆరోగ్య మంత్రి డా. అన్బుమణి రామదాసు ఆధ్వర్యంలో పనిచేస్తాయి. అలాగే 8 కొత్త అంబులెన్సులను ఈ చార్‌ధామ్ యాత్రలో యాత్రికులకు  అందుబాటులోకి తెచ్చారు. అత్యవసర అంబులెన్సులను బదరీనాధ్, పండుకేశ్వర్, వసుకేదార్, ఫాతా, సొన్‌ప్రయాగ్, హర్సిల్, రానాఛట్టి మరియు కందిఖల్ వద్ద అన్నివేళలా అందుబాటులో ఉంటాయి. 

.What is the availability of oxygen cylinders during the chardham yatra?

చార్‌ధామ్ యాత్ర సమయంలో ఆక్సిజెన్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయా?

చార్‌ధామ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలు అన్నింటిలో ఆక్సిజెన్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. యాత్ర సమయంలో ఎవరికైనా అవసరమైతే ఆ సేవలను వినియోగించుకోవచ్చు. 

Is the trip suitable for heart patients?

గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఈ యాత్ర చేయవచ్చా? 

ప్రయాణంలో ఎక్కువగా నడిచి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి హృద్రోగులకు ఈ యాత్ర అస్సలు సురక్షితం కాదు, హెలికాప్టర్‌లో అయితే కొంత వరకు అలసట లేకుండా తక్కువ రిస్క్ ఉంటుంది. 

What is the age limit of a Char Dham Traveller ?

చార్‌ధామ్ యాత్రికునికి వయో పరిమితి ఏమైనా ఉందా?

చార్‌ధామ్ అధికారిక వర్గాల ప్రకారం ఎటువంటి వయో పరిమితి లేదు, కానీ 7 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు వారు వెళ్ళవచ్చని సూచన మాత్రం జారీ చేశారు. మిగిలిన వయస్సులవారు వెళ్ళాలనుకుంటే డాక్టర్ చెకప్ చేయించుకోవాలి.  

Can Senior Citizens Over the Age of 60/70 Make this Journey?

60/70 ఏళ్ళ వయోవృద్ధులు ఈ యాత్ర చేయగలరా? 

తప్పకుండా చేయచ్చు, చార్‌ధామ్ యాత్ర పూర్తిగా సురక్షితం మరియు వయో వృద్ధులకు కూడా వెళ్ళడానికి అవకాశం, సదుపాయాలు కూడా ఉన్నాయి. యాత్రికుల కోసం భారత ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసింది. హెలికాఫ్టర్లు. పోని , పల్లకీలు మొదలైన వాటి సహాయంతో వయోవృద్ధులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేయచ్చు. ఇక ప్రతిసారి చెప్పినట్లే మీ డాక్టర్‌ని కలిసి చెకప్ చేయించుకున్న తరువాత మాత్రమే యాత్రకు ఏర్పాట్లు చేసుకోవాలి. 

What is Mountain Sickness , and what precautions should one take for chardham yatra?

మౌంటెన్ సిక్నెస్ అంటే ఏమిటి, చార్‌ధామ్ యాత్ర చేసేటప్పుడు దానికోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

రోడ్డు మార్గాన చార్‌ధామ్ యాత్రలో ఎన్నో ఎత్తు పల్లాలు వస్తాయి. వీటివల్ల నీరసం, వికారం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కసారిగా పల్లానికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని సిద్ధంగా ఉండాలి. మీకు ఇంతకముందు ఇలాంటి ప్రయాణాల కారణంగా ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్‌ని కలిసి అందుకు మందులు తీసుకుంటే మంచిది. 

చార్‌ధామ్ ప్యాకింగ్ లిస్టు

What are a Few Essential Items of Travel that I should not forget to Bring?

యాత్రలో మరచిపోకుండా తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏమిటి?

చార్‌ధామ్ యాత్రలో వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ వస్తువులను తీసుకెళ్లడం మంచిది-

  • ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక చికిత్స) కిట్
  • మీరు రోజూ వేసుకునే మందులు 
  • యాంటిబయోటిక్స్- సల్ఫామిథాక్సిజోల్, ట్రైమిథోప్రిమ్- బ్యాక్టీరియమ్ డిఎస్ లేదా సెప్‌ట్రాన్ డిఎస్ 
  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ- ఎవిల్, బ్రుఫిన్ లేదా మార్టిన్. ఆస్ప్రిన్/ టైలినాల్ లేదా సాధారణ పెయిన్ కిల్లర్స్. 
  • మౌంటెన్ సిక్నెస్ కోసం- ఎసిటాజోలమైడ్ (డయామాక్స్, డయామాక్స్ సీక్వెల్స్) లేదా మీ దగ్గర వెచ్చని ఉన్ని దుస్తులు ఉంటే  డెక్సామిథాజోన్ (AK- DEX, Ocu- Dex)
  • టాయిలెట్ కిట్, షేవింగ్ కిట్, నెయిల్ కట్టర్, కత్తెర, స్విస్ నైఫ్
  • శీతాకాలంలో ఉపయోగించే ఊలు గ్లౌజులు, మఫ్లర్లు, స్కార్ఫులు, మంకీ క్యాప్ మొదలైన వస్తువులు 
  • ఒక చిన్న బ్యాగులో టార్చ్ లైట్, బ్యాటరీలు, చాక్లేట్లు, చిన్న పోర్ట్రబుల్ ఛార్జర్ తీసుకోవాలి
  • మంచి నీళ్ళ బాటిల్ 
  • గొడుగు, రైన్ కోటు 
  • బైనాకులర్స్ 
  • మీరు ఉపయోగించే సబ్బులు, షాంపూలు 
  • పవర్ బ్యాకప్ 
  • జారకుండా ఉండే షూస్/ స్పోర్ట్స్ షూస్/ ట్రెక్కింగ్ షూస్ 
  • మరొక జత చెప్పులు 
  • చలువ కళ్లద్దాలు (సన్ గ్లాసెస్)
  •  దోమల మందు 
  • కెమెరాలు, వీడియో రికార్డర్లు 
  • సన్‌స్క్రీన్ ఆయిల్, స్కిన్ యాంటిబయోటిక్ క్రీమ్ 
  • చార్‌ధామ్ మ్యాపు, కంపాస్

చార్‌ధామ్ యాత్రకు ప్లాన్ చేసేముందు తెలుసుకోవాల్సిన అంశాలు

Are There Any ATMs Available in and Around the Char Dham Sites?

చార్‌ధామ్ పరిసర ప్రాంతాల్లో ఏటీఎంలు ఏమైనా ఉన్నాయా?

చార్‌ధామ్ పరిసర ప్రాంతాల్లో ఏటీఎంలు దాదాపు ఉండవు. క్షేత్రాల వద్ద కొన్ని ఉంటాయి కానీ అక్కడ డబ్బులు దొరుకుతాయని చెప్పలేము. డెహ్రాడూన్, హరిద్వార్ ప్రధాన నగరాలు, అక్కడ ఏటీఎంలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందుగానే సరిపడా డబ్బులు దగ్గర పెట్టుకోమని యాత్రికులకి సూచిస్తాము.  

Which mobile network works in the Uttarakhand mountains?

ఉత్తరాఖండ్ కొండల్లో ఏ మొబైల్ నెట్‌వర్క్ బాగా పనిచేస్తుంది?

ఉత్తరాఖండ్ కొండల్లో బిఎస్ఎన్ఎల్ ఒక్కటే ఆధారపడదగినది, అన్ని క్షేత్రాల్లో ఎలాంటి సమస్య లేకుండా అది పనిచేస్తుంది. అది కాకుండా ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్ మరియు జియో కూడా బాగానే పనిచేస్తాయి. అప్పుడప్పుడు వీటిలో నెట్‌వర్క్ సమస్య ఉన్నప్పటికీ వాటిల్లో ఎదో ఒక సిమ్ ఉంచుకోవడం మంచిదే.

హెలికాఫ్టర్‌లో చార్‌ధామ్ యాత్ర- తరచుగా అడిగే ప్రశ్నలు

How Many Persons Can Fly Together in A Helicopter in Chardham Yatra?
చార్‌ధామ్ యాత్ర చేయడానికి ఒక హెలికాఫ్టర్‌లో ఎంత మంది ప్రయాణించగలరు?

ఒక హెలికాఫ్టర్‌లో గరిష్ఠంగా 5 నుంచి 6 మంది యాత్రికులు ప్రయాణించవచ్చు. 

How Much Weight Can a Helicopter Lift and Carry in Chardham Yatra?

చార్‌ధామ్ యాత్రలో ఒక హెలికాఫ్టర్ ఎంత బరువును మోసి తీసుకెళ్లగలదు?

చార్‌ధామ్ యాత్ర హెలికాఫ్టర్ గరిష్ఠంగా 450 కిలోలు మోసి తీసుకెళ్లగలదు. 

What should be the maximum weight of a person flying?

హెలికాఫ్టర్‌లో ప్రయాణించడానికి ఒక మనిషి ఎంత బరువు ఉండొచ్చు?

హెలికాఫ్టర్‌లో చార్‌ధామ్ వెళ్ళడానికి ఒక మనిషి ఉండాల్సిన గరిష్ట బరువు 75 కిలోలు. అక్కడికి వెళ్ళాక ఒకవేళ మీరు ఇచ్చిన సమాచారంలో తప్పు ఉన్నా, మారే ఇతర కారణాల వల్ల అయినా మీరు ఎక్కువ బరువు ఉన్నట్లయితే మీ హెలి-టూర్ క్యాన్సల్ చేస్తారు (డబ్బులు కూడా తిరిగి ఇవ్వబడదు). కాబట్టి ఫారం నింపేటప్పుడు సరైన బరువు ఇస్తున్నట్లు నిర్ధారించుకోండి. బరువు, వాహనానికి సంబంధించి విమానయానంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. 

What will be extra weight charges while flying in a helicopter for the chardham yatra sector?

హెలికాఫ్టర్‌ చార్‌ధామ్ యాత్రలో అదనపు బరువుకు ధర ఏవిధంగా ఉంటుంది?

విమానయాన నియమాల ప్రకారం 75 కిలోల బరువు దాటిన ప్రతీ యాత్రికుడు అదనంగా రూ.1200లు చెల్లించాలి.

Does Helicopter yatra allow personal baggage and What is maximum baggage weight allowed?

హెలికాఫ్టర్ యాత్రలో మాతో పాటు సామాను కూడా తీసుకెళ్ళచ్చా, అయితే ఎంత బరువు తీసుకెళ్ళచ్చు?

చార్‌ధామ్ హెలికాఫ్టర్ యాత్రలో మీరు కేవలం 5 కిలో సామాన్లు మాత్రమే తీసుకెళ్లగలరు. ఇందులో చోటు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అంతకు  మించి బరువు తీసుకెళ్లడం సాధ్యం కాదు. విమానయాన నియమాలు చాలా కఠినంగా ఉంటాయి, కాబట్టి మీ సామాను బరువు 5 కిలోలకు మించి లేకుండా చూసుకోండి.  

What are the pick-up/drop off points for helicopter yatra?

హెలికాప్టర్ యాత్రలో పికప్/ డ్రాప్ పాయింట్లు ఏ ప్రదేశాలలో ఉంటాయి? 

చార్‌ధామ్ యాత్రకు పికప్/ డ్రాప్ పాయింట్లు డెహ్రాడూన్ విమానాశ్రయం, డెహ్రాడూన్ బస్‌స్టాండ్, హరిద్వార్ రైల్వే స్టేషన్ మరియు డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాయి.  

What is the age limit for kids for helicopter Yatra?

హెలికాఫ్టర్ యాత్రలో ఏ వయసు పిల్లలకి అనుమతి ఉంది?

2 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు టికెట్ అవసరం లేదు. 2 సంవత్సరాలు పైబడిన పిల్లలకి మాత్రం పూర్తి మొత్తంలో టికెట్ ధర ఉంటుంది. 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లండి. 

What are the Perks of Going on Char Dham Yatra by Helicopter?

చార్‌ధామ్ హెలికాఫ్టర్ యాత్ర ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి?

చార్ధామ్ హెలికాఫ్టర్ యాత్రలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ప్రయాణ సమయం చాలా మేరకు తగ్గిపోతుంది, అలాగే క్షేత్రస్థలాల వద్ద ఎక్కువ సమయం ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి, దూర ప్రయాణాలు చేయలేని స్థితిలో ఉంటే హెలికాఫ్టర్ యాత్ర చాల సులువు అవుతుంది. 

What is VIP Darshan in Char Dham Yatra?

చార్‌ధామ్ యాత్రలో విఐపి దర్శనం వివరాలు ఏమిటి?

విఐపి దర్శనం లేదా శీఘ్ర దర్శనం హెలికాఫ్టర్ ప్యాకేజీతో పాటు వస్తుంది. కేదారనాథ్, బదరీనాధ్‌లలో విఐపి దర్శనానికి అవకాశం ఉంది. దీనివల్ల హెలికాఫ్టర్ యాత్ర చేసేవారి యాత్రా సమయం బాగా తగ్గుతుంది.

చార్‌ధామ్ యాత్రకి ఎలా బుక్ చేసుకోవాలి

What is the Best Way to Book My Char Dham Yatra?

నేను చార్‌ధామ్ యాత్రకు సరైన ప్రణాళికతో ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు?

చార్‌ధామ్ యాత్రకు ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవడమే అన్నిటికన్నా మంచిది. ఇందులో అనుభవం ఉన్న చాలా ఆపరేటర్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ప్రయాణం, వసతి, భోజన సదుపాయాలతో ఎన్నో రకాల ప్యాకేజీలను అందిస్తున్నారు. దానిలో మీ బడ్జెట్‌కి తగ్గట్టు వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ఈ ప్యాకేజీల ద్వారా మీరు ఎంత మంది యాత్ర చేస్తున్నారు అనే దాన్నిబట్టి, ట్యాక్సీ, ఎస్‌యువి, టెంపో ట్రావెలర్ లేదా బస్సును బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ విధానం కూడా చాలా సులువు, ఆన్‌లైన్‌లోనే వారి బుకింగ్ పాలసీ ప్రకారం చేసుకోవచ్చు. బాధ్యత కలిగిన ట్రావెల్స్ వారు మీకు సాధారణంగా అక్కడి అధికారులు విధుల చేసిన ప్రకటనలు, వార్తలు, వాతావరణ పరిస్థితులు, విఐపి దర్శనం, కస్టమర్ కేర్ సప్పోర్ట్ మొదలైన వాటి గురించి సరిపడా సమాచారం మీకు అందిస్తూ ఉంటారు. మీరు హెలికాఫ్టర్ యాత్ర బుక్ చేసుకున్నట్లైతే చాలా సమయం ఆదా అవుతుంది. కేదారనాథ్‌లో హెలికాఫ్టర్ షటిల్ సర్వీసులను కూడా ఈ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా బుక్ చేసుకుని కంఫర్మ్ టిక్కెట్లు పొందవచ్చు.   

chardhambyhelicopter.com ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా హెలికాఫ్టర్ యాత్రను చేయవచ్చు. వీళ్ళు హెలికాఫ్టర్ యాత్రలో నిష్ణాతులైన Trek N Tales వారితో కలిసి పనిచేస్తున్నారు. Trek N Tales ట్రావెల్ కంపెనీ చార్‌ధామ్, (దో ధామ్) రెండు క్షేత్రాల సందర్శన, (ఏక్ ధామ్) ఒక క్షేత్ర సందర్శన యాత్రలో 15 సంవత్సరాలకు పైగా సరైన అనుభవం, నైపుణ్యం కలిగి ఉన్నారు. 

Are the meals included in the Chardham tour packages?

చార్‌ధామ్ యాత్ర ప్యాకేజిలలో భోజనం కూడా అందిస్తారా?

అవును, ఈ ప్యాకేజీలో భోజనం కూడా అందించడం జరుగుతుంది. మీరు ప్లాన్ ఎంపిక చేసుకున్నాక బుక్ చేసుకునే ముందు ఒకసారి వివరాలు మొత్తం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవడం ఉత్తమం. 

Is anything extra to be paid during the tour?

యాత్ర మధ్యలో ఎక్కడైనా అదనపు రుసుము చెలించాల్సి వస్తుందా?

సాధారణంగా యాత్రకు కావాల్సిన ప్రాథమిక సేవలు పోనీ, పల్లకి, హెలికాఫ్టర్, ట్యాక్సీ మొదలైనవి అన్నీ ప్యాకేజీలో ఉంటాయి. మరింత సమాచారం కోసం మీరు ఎంపిక చేసుకునే ప్లాన్ వివరాలను పరిశీలించండి. 

What is the minimum number of people you require for The Char Dham tour?

చార్‌ధామ్ యాత్రకు కనీస ఎంత మంది వెళ్ళచ్చు?

చార్‌ధామ్‌కు ఎవ్వరైనా రావచ్చు. ఒక్కరితో మొదలుకుని ఎంత మందికైనా స్వాగతం. మీరు ఎంత మంది ఉన్నారనే దాన్ని బట్టి యాత్ర ఖర్చు పెరగడం/ తగ్గడం ఆధారపడి ఉంటుంది.